Guntur Prisons Recruitment 2025: జైళ్ల శాఖ లో ఉద్యోగాలు
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రిజన్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. డిస్ట్రిక్ట్ జైల్ గుంటూరు లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ Guntur Prisons Recruitment 2025 ద్వారా వాచ్మెన్, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్, ఫార్మసిస్ట్ గ్రేడ్ - 2 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
అవుట్సోర్సింగ్ బేసిస్ కింద ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు సెప్టెంబర్ 30, 2025 వ తేదీ లోపు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.
ఈ Guntur Prisons Recruitment 2025 ద్వారా
వాచ్మెన్ - 1 పోస్టు
ఆఫీస్ సబార్డినేట్ - 1 పోస్టు
డ్రైవర్(LMV) - 1 పోస్టు
ఫార్మసిస్ట్ గ్రేడ్ - 2 - 1 పోస్టు భర్తీ చేస్తున్నారు.
Age Limit:
ఆగస్టు 31, 2025 వ తేదీ నాటికి 18 సంవత్సరముల నుండి 42 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అందరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబిసి మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మూడు సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
వాచ్మెన్ - 5 వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులకు తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
ఆఫీస్ సబార్డినేట్ - 7 వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులకు తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
డ్రైవర్(LMV) - అభ్యర్థులు పదవ తరగతి పాస్ అయి ఉండాలి. అలానే LMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే ఎక్సపీరియన్స్ ను కుడా అడగడం జరిగింది. మిగతా వివరాలను మీరే అఫిషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
ఫార్మసిస్ట్ గ్రేడ్ - 2: ఇంటర్ చదివిన తర్వాత బి ఫార్మసీ/డి ఫార్మసీ/Pharma-D/ఎం ఫార్మసీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అలాగే అభ్యర్థులు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.
అభ్యర్థులకు తెలుగు మరియు ఇంగ్లీష్ ను చదవడం, మాట్లాడటం, రాయడం వచ్చి ఉండాలి.
అభ్యర్థులు కంప్యూటర్ పై నాలెడ్జ్ కలిగి ఉండాలి. అలానే Ms Office వచ్చి ఉండాలి.
ఇంకా స్కిల్స్ అడగడం జరిగింది ఇంట్రెస్ట్ ఉంటే అఫిషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
Selection Process:
75% మెరిట్ ఆధారంగా మరియు 25% ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
How To Apply:
ఈ Guntur Prisons Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి. ముందుగా https://guntur.ap.gov.in/ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకోవాలి. తరువాత అప్లికేషన్ ఫారం ను నింపి, వారు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి అడిగిన అడ్రస్ కి వెళ్లి అందజేయాలి.
సెప్టెంబర్ 30, 2025 వ తేదీ లోపు అందజేయాలి. నోటిఫికేషన్ లో కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు చూసుకోండి.
Salary:
వాచ్మెన్ - 15,000 రూపాయలు
ఆఫీస్ సబార్డినేట్ - 15,000 రూపాయలు
డ్రైవర్(LMV) - 18,500 రూపాయలు
ఫార్మసిస్ట్ గ్రేడ్ - 2 - 17,500 రూపాయలు
Official Website: https://guntur.ap.gov.in/
0 కామెంట్‌లు